బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు : కేసీఆర్

KCR SPEACHబంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర 4వ అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం (జూన్-2) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం.  దశాబ్దాల కాలంలో కలలు కన్న తెలంగాణను అభివృద్ధి పరుస్తున్నామని, సంక్షమ పథకాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలువడం సంతోషకరమన్నారు. సకల జనుల సంక్షేమానికి పాటు పడుతున్నామని, 42 లక్షల పెన్షన్లు ఇస్తూ..ఆసరాగా నిలుస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, మిషన్ కాకతీయ, భగీరథ లాంటి పథకాలతో ప్రజల వద్దకు పాలన దిశగా ముందుకెళ్తున్నామన్నారు. గోదాముల నిర్మాణాలు, వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజాన్ని కల్పించామన్నారు.

ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త..నేడు కరెంటు పోతే వార్త అనే విధంగా వ్యవసాయానికి 24 గంటల నిరంతరం కరెంటు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. సమైక్య పాలకులు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతుంటే ఏనాడు కాంగ్రెస్ నాయకులు మాట్లడలేదని, 70 సంవత్సరాల్లో కీలకమైన ప్రాజెక్టులను తెలంగాణకు రప్పించుకున్నామన్నారు. శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని, తెలంగాణ ప్రభత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు కేసీఆర్. ప్రాజెక్టుల కోసం ఏటా అసెంబ్లీలో ప్రత్యేక బడ్జెట్ ను కేటాయిస్తున్నామని, కోటీ ఎకరాలకు నీరు అందించి, తెలంగాణను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పొట్ట చేత పట్టుకుని కూలీలకు పోయినవారెందరో.. మళ్లీ గ్రామాలకు వస్తున్నారని, పాలమూరుకు ఉన్న కరువు జిల్లా అనే పేరును మార్చేసి.. పచ్చటి పాలమూరుగా మార్చామన్నారు. గోదావరి నదీ జిల్లాలను సమగ్రంగా వినియోగించుకునేందుకు కాళేశ్వరం వరప్రదాయినిగా నిర్మితం అవుతుందన్నారు.

రికార్డు లెవల్ లో పనులను పూర్తి చేస్తున్నామని, కేంద్ర జలసంఘం పరిశీలించి, దేశంలోనే కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టని మెచ్చుకున్నట్లు చెప్పారు. రైతాంగాన్ని మరింతగా ఆదుకునేందుకు తపన తనలో ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయాన్ని మరింతగా బలోపేతం చేస్తామని, ఈ పథకాలు ఇంతటితో ఆగవన్నారు. చెమటోడ్చి దేశానికి అన్నంపెట్టే రైతు చనిపోతే ఆ కుటుంబం కష్టాల్లో పడకూడదని.. రైతులకు ఉచిత భీమాను ప్రవేశపెడుతున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి రైతులకు భీమా పత్రాలు అందజేస్తామని తెలిపారు కేసీఆర్. జూన్ 20లోగా పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు వందశాతం పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. త్వరలోనే ధరణీ వెబ్ సైట్ రాబోతుందన్నారు.

యాదవులకు ఉచిత గొర్రెల పంపిణీ చేశామని, దీంతో రాష్ట్రంలో మాంసానికి కొదవలేకుండా ఉందన్నారు. చేపల పెంపకానికి కృషి చేశామని, ముదిరాజ్ లకు చేతినిండా పని దొరకుతుందన్నారు. గీత కార్మికుల కోసం ఈత, తాటి చెట్ల పెంపకానికి కృషి చేశామన్నారు. కొత్తగా జాతీయ రహదారులను సాధించుకున్నామని, గత ప్రభుత్వాలు అవినీతి మయంలో ఆగం చేశారన్నారు. డబుల్ బెడ్ ఇళ్లు నిర్మించి ఇవ్వడం దేశంలోనే మొదటిసారి అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఆశావర్కర్లు సమర్ధవంతంగా పని చేయాలని ప్రభుత్వం జీతాలను పెంచడం జరిగిందన్నారు. ప్రభుత్వ హస్పిటల్స్ పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని, అన్ని హస్పిటల్స్ లో సధుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు. అవసరమైన మరమత్తులను చేపట్టామన్నారు. హస్పిటల్ రంగానికి సంబంధించి, పలు అవార్డులు అందుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కంటి పరీక్షల కోసం కంటి వెలుగు పేరుతో ఉచితంగా ట్రీమ్ మెంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఇంటిని మరిపించేలా గురుకులాల్లో సౌకర్యాలను కల్పించామన్నారు. మన గురుకులాల్లో ఉన్న వసతులు ఏ రాష్ట్రంలో లేవన్నారు. సివిల్స్ లో తెలంగాణ టాపర్ గా రావడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్..ఉన్నత చదువు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం మంచి పేరు వచ్చిందని, ఈ సారి రాబోయే హరితహారం విజయవంతం చేయాలని సూచించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దీంతో ఎస్టీలకు సర్పంచ్ లుగా ఉండే అవకాశం వచ్చిందన్నారు. ఐటీ రంగంలో ప్రపంచంలోనే హైదరాబాద్ టాప్ గా ఎదిగిందన్నారు. పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ప్రజల జీవితంలో కల్లోలం సృష్టించిన సారా, పేకాటను పూర్తిగా నిషేదించామన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణను..బంగారు తెలంగాణగా మార్చుకుందామన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates