బంగారు బిస్కెట్లు కాదు : సీఎం టీ, బిస్కెట్ల ఖర్చు రూ.68 లక్షలు

Trivendra-Singh-Rawat-1-644x362

మనం టీ తాగాలంటే 6 రూపాయలు.. అదే డబ్బున్నోళ్లు తాగాలంటే రూ.250.. అదే సీఎం టీ తాగితే ఇంకొంచెం ధర ఎక్కువ ఉండొచ్చు. స్నాక్స్ కింద బిస్కెట్లు అయితే మరో వందో, రెండొందలో ఖర్చు అవుతుంది. ఏడాది మొత్తం ఇలా తిన్నా.. సీఎం రేంజ్ లో రూ.5లక్షలు అవుతుంది.. అదే టీ, బిస్కెట్ల ఖర్చు రూ.68 లక్షలు అంటే.. ఔరా అని నోరెళ్లబెట్టాల్సిందే. అవును.. నిజంగా ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ టీ, బిస్కెట్ల కోసం ఇంత ఖర్చు చేశారు.

సీఎం రావత్ స్నాక్స్ గత ఏడాది ఖర్చు చేసిన మొత్తాన్ని తెలపాలంటే RTI కార్యకర్త హేమంత్ సింగ్ పెట్టుకున్న దరఖాస్తుకు.. అధికారులు ఇచ్చిన సమాధానంతో అతనే షాక్ అయ్యాడు. ఏడాది కాలంలో సీఎం రావత్.. టీ, బిస్కెట్ల ఖర్చు రూ.68 లక్షలు అయినట్లు తెలిపారు. ఇది తెలిసి దేశం మొత్తం షాక్ అయ్యింది. అక్షరాల 68లక్షల 59వేల 865 రూపాయలు ఎలా ఖర్చు చేశారో అర్థం కావటం ప్రజలకు. ఒక్కడే తిన్నాడా.. పంచిపెట్టారా అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఎన్ని అధికారిక మీటింగ్స్ పెట్టి.. ఎంత మంది అధికారులకు టీ, బిస్కెట్లు ఇచ్చినా 68 లక్షలు ఎలా ఖర్చయ్యిందో ఎవరికీ అర్థం కావటం లేదు. మామూలు బిస్కెట్లు తిన్నాడా.. బంగారు బిస్కెట్లు తిన్నాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు..

Posted in Uncategorized

Latest Updates