బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియాకు ఐదేళ్లు జైలు శిక్ష

kkkఅవినీతి కేసులో మాజీ ప్రధానమంత్రికి శిక్ష పడింది. అనాధ శరణాలయానికి సేకరించిన విదేశీ నిధలను దుర్వినియోగం చేశారంటూ ఐదు సంవత్సరాల కఠిన కారాగారా శిక్షను విధించింది కోర్టు. బంగ్లాదేశ్ ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియా(72)కు గురువారం ఢాకా కోర్టు ఐదు సంవత్సరాల కఠిన కారాగారా శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రతిపక్ష బీఎన్‌పీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్న ఆమె మూడుసార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేశారు. తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్‌ రెహ్మాన్‌ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన అనాథ శరణాలయానికి సేకరించిన విదేశీ నిధులను దుర్వినియోగం చేశారంటూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. జియా కొడుకు, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(BNP) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తారిక్‌నూ దోషిగా తేల్చిన కోర్టు అతనితో పాటు మరో నలుగురికి 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. దోషులందరికి ఈ కేసులో సమాన పాత్ర ఉన్నా జియా వయసు, సమాజంలో ఉన్న గౌరవం రీత్యా ఆమెకు తక్కువ శిక్ష విధిస్తున్నట్లు జడ్జి మహ్మద్‌ అక్తారుజ్జమాన్‌ తన తీర్పు ప్రతిలో తెలిపారు. కోర్టు తీర్పు రాగానే జియా మద్దతుదారులు, అభిమానులు ఆందోళనలతో ఢాకాలో పలుచోట్ల హింసకు పాల్పడ్డారు. భారీ భద్రత నడుమ జియాను కేంద్ర కారాగారానికి తరలించారు. గతంలో చేసిన పాపాలకు ఫలితంగానే ఆమెకు ఈ శిక్ష పడిందని, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్‌ చేస్తామని జియా తరఫు లాయర్‌ తెలిపారు.

 

 

Posted in Uncategorized

Latest Updates