బంగ్లాదేశ్ సంచలనం : ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు

bangladeshఎవరూ ఊహించని.. కలలో కూడా ఆలోచన చేయటానికి భయపడేది రిజర్వేషన్ల అంశం. అలాంటి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈ కోటాను కనీసం 10శాతం అయినా తగ్గించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. కొన్నేళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఉధృతం అయ్యింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురు, శుక్రవారం భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. లక్షల మంది స్టూడెంట్స్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కదం తొక్కారు.

పరిస్థితులు చేయి దాటి పోవటంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది ప్రధాని షేక్ హసీనా. 10, 20శాతం కాదు.. ఏకంగా రిజర్వేషన్ల విధానాన్నే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 56శాతాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్ లో పూర్తి రిజర్వేషన్ విధానం ఉండదా అంటే చెప్పలేం అంటున్నారు. కొత్త విధివిధానాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి అయితే బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అయితే లేవు. టాలెంట్ ఉంటే చాలు.. సర్కారీ జాబ్ నీ సొంతం.

ప్రధాని షేక్ హసీనా నిర్ణయంతో నిరుద్యోగులు, విద్యార్థులు కూడా షాక్ అయ్యారు. కొంత శాతం తగ్గుతాయి అని భావించారు కానీ.. ఏకంగా ఎత్తివేస్తారని అనుకోలేదు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలు మాత్రం మరో ఉద్యమానికి రెడీ అవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates