బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

car-accident-banjarahillsహైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నా …డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నవారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.  ఇందులో భాగంగానే బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. కేబీఆర్‌ పార్క్ వైపు నుంచి పంజగుట్ట వైపు వెళ్తున్న కారు మసీదు మలుపు  దగ్గర ఓవర్ స్పీడ్ తో దూసుకొచ్చింది. భయాందోళనకు గురైన వాహనదారులు, నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లు అటు పరుగులు తీశారు. కారు రోడ్డు మధ్య నున్న డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారు తుక్కుతుక్కైంది. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత కారును అక్కడే వదిలేసి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదమా అనే కోణంలో విచారిస్తున్నారు.

మరోవైపు  జూబ్లీహిల్స్‌లోని డైమండ్ హౌస్ దగ్గర శుక్రవారం(జూన్-29) పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అదే టైంలో ఓ యువతి హ్యుందయ్‌ క్రెట కారులో (TS 09 EU 9450) వచ్చింది. బ్రీత్‌ ఎనలైజర్‌తో మద్యం సేవించిందో లేదో తనిఖీ చేసే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న హోండా సిటీ కారును ఢీకొట్టి వేగంగా డ్రైవింగ్‌ చేస్తూ పారిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. అయితే రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ అవటంతో ఆ యువతి పోలీసులకు దొరికిపోయింది. మద్యం సేవించిందేమోననే తనిఖీ చేయగా ఆల్కహాల్ శాతం జీరో వచ్చింది. దీంతో యువతి పైన రాష్ డ్రైవింగ్ కేసును నమోదు చేసి కారును సీజ్ చేశారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates