బంద్ ఉద్రిక్తత ..హెల్మెట్ పెట్టుకున్న RTC డ్రైవర్లు

హౌరా : ఇటీవల నార్త్ దినాజ్‌ పూర్‌ లోని ఇస్లామ్‌పుర్‌ లో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఆ ఘటనకు నిరసనగా ఇవాళ (సెప్టెంబర్-26) బీజేపీ బంద్‌ కు పిలుపునిచ్చింది. బస్సులపై దాడి జరుగుతున్న క్రమంలో RTC డ్రైవర్లు తలకు హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో వెస్ట్ బెంగాల్ లో RTC డ్రైవర్లందరూ హెల్మెట్లు పెట్టుకుని బస్సులు నడుపుతున్నారు.

రాష్ట్ర బంద్ కారణంగా పలుచోట్ల ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలోనే కొన్ని బస్సులను ద్వంసం చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు..తలకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండేందు పలువురు RTC డ్రైవర్లు హెల్మెట్లు పెట్టుకుని బస్సులు నడుపుతున్నారు.  హౌరా-బర్దమన్ రైల్వే మార్గంతో పాటు మరికొన్ని రూట్లలో నిరసనకారులు రైళ్లను నిలిపేశారు. బంద్ సందర్భంగా ఇవాళ హౌరా సిటీలో భద్రతను పెంచారు. అన్ని కీలక ప్రాంతాల్లో అదనపు భద్రతను మోహరించారు.

 

Posted in Uncategorized

Latest Updates