బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్

airtel-officeతమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారతీఎయిర్‌టెల్ మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. నోకియా 2. నోకియా 3 కొనుగోలుదారులకు రూ. 2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది ఎయిర్‌టెల్. నోకియా 2, నోకియా 3 ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది.

36 నెలల తర్వాత ఎయిర్‌టెల్ వాలెట్‌లో క్యాష్‌బ్యాక్ డబ్బులు రూ. వేలు జమ అవుతాయని తెలిపింది. HMD గ్లోబల్ ఆధ్వర్యంలో ఈ ఆఫర్ అందిస్తున్నట్లు సంస్థలు చెప్పాయి.  నోకియా 2, నోకియా 3 4జీ స్మార్ట్‌ఫోన్లకు రూ. 2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది.  4జీ స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులు రూ. 169తో రీచార్జ్ చేసుకుంటే ప్రతి రోజు 1జీబీ 4జీ డేటా, అపరిమిత ఎస్టీడీ, లోకల్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని సంస్థ తెలియజేసింది.

నోకియా 3 స్మార్ట్‌ఫోన్ రూ. 9 వేల 499, నోకియా 2 రూ. 6 వేల 999కే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ. 3వేల  500 విలువైన రీచార్జి చేసుకుంటే 18 నెలల్లో మొదటి విడత క్యాష్‌బ్యాక్ రూ. 500, రెండు సారి మరో రూ. 3 వేల 500 విలువైన రీచార్జ్ చేసుకుంటే రెండో విడత రూ. 1500 క్యాష్‌బ్యాక్ 18 నెలల్లో ఎయిర్‌టెల్ వాలెట్‌లో జమ అవుతుందని సంస్థ వెల్లడించింది.

Posted in Uncategorized

Latest Updates