బంపర్ మేనిఫెస్టో : కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

మహబూబాబాద్ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించడం పట్ల తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసిఆర్ చిత్ర పటానికి ఎర్రబెల్లి కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి కేసిఆర్ బతుకమ్మ పండుగ నాడు బంగారు వరాలు ప్రకటించారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

కేసీఆర్ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పాక్షిక మేనిఫెస్టో ప్రకటనపై రాష్ట్ర ప్రజలంతా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పింఛను రెట్టింపు చేయడంతో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పంట సాయం పెంపుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు పంట పెట్టుబడి సాయం రూ.10వేలకు పెంచడంతో పాటు లక్ష రుణమాఫీ ప్రకటించడంపై రైతన్నలు సంతోషపడుతున్నారు. కొత్తగా నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3,016 భృతి ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో కేసీఆర్‌కు యువత ధన్యవాదాలు చెబుతూ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కేసీఆర్ వరాలు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటుతున్నాయి. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకుంటున్నారు.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates