బంఫరాఫర్ : 300 ఎకరాలు 6 కోట్లకే….22 బిల్డింగ్ లు కూడా

townమెట్రో సిటీల్లో ఒక ఎకరం స్ధలం కొనుగోలు చేయాలంటే కోట్లలో ఖర్చు చేయాల్సిందే.  కోట్లు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్న స్ధలం దొరకడం కూడా చాలా కష్టమే. అలాంటిది సిటీలో 300 ఎకరాలను కేవలం 6 కోట్ల రూపాయలకే ఇచ్చేస్తామంటుంటే అసలు ఇది నమ్మలా వద్దా అని ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు ఎవరయినా. మనం వింటుంది నిజమేనా గిల్లుకొని చెక్ చేసుకోవాల్సింది. అవును ఇది నిజమే. 6 కోట్లకే 300 ఎకరాలు అమ్మకానికి రెడీగా ఉంది. అయితే మీరు చేయాల్సిందల్లా భయాన్ని వదిలెయ్యటమే. భయాన్ని వదిలేస్తే…6 కోట్లకే 300 ఎకరాలు మీ సొంతం అవుతుంది. ఎక్కడబ్బా ఇది అని అనుకుంటున్నారా! మన దేశంలో కాదులెండీ. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ కు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉంది ఈ స్ధలం.

క్యాలిఫోర్నియాలోని సెర్రో గోర్డో ప్రాంతంలో వెండి నిక్షేపాలు ఎక్కువగా ఉండేవి. వీటి కోసం అక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగేవి. అయితే మితిమీరి  తవ్వకాలు  జరపడం వల్ల 1880లో అగ్ని ప్రమాదం జరగి ఆ ప్రాంతమంతా ఏడారిగా మారిపోయింది. 1938 నాటికి అక్కడ వెండి నిక్షేపాలు ఖాళీ అవ్వడంతో తవ్వకాలు నిలిపివేయబడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. ఖాళీగా మారిన ఆ ప్రాంతాన్ని మైఖేల్‌ పాటెర్సన్‌ అనే వ్యక్తి దక్కించుకొని స్ధిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాత ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన వారసులు 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్రాంతాన్ని కేవలం 9 లక్షల 25వేల డాలర్లకు అంటే మన కరెన్సీలో దాదాపు 6.24 కోట్లకు అమ్మకానికి పెట్టారు. గోస్ట్‌ టౌన్‌ ఫర్ ‌సేల్‌ అనే వెబ్‌సైట్‌ లో దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఉంచారు.  ప్రస్తుతం ఈ 300 ఎకరాల్లో హోటల్‌, బంక్‌ హౌస్‌, సెలూన్‌, 22 నివాసయోగ్యమైన బిల్డింగ్స్ కూడా., దొంగల బెడద లేకుండా భద్రతా వ్యవస్థ కూడా పఠిష్టంగా ఉంది. ఈ స్ధలం పక్కనే నీటికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఓ నది కూడా ప్రవహిస్తుంది. అంతేకాకుండా ఈ స్ధలం కొన్నవారికి అక్కడ ఏమైనా నిక్షేపాలు ఉంటే తవ్వకాలు జరపడానికి హక్కులు కూడా లభిస్తాయంటా. అయితే ఈ ప్రాంతంలో దెయ్యాలు తిరుగుతాయని పుకార్లు ఉన్నాయి. దీన్ని స్ధానికులు గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ స్ధలానికి ఎవరూ దక్కించుకొని వాళ్ల లక్ ని పరీక్షించుకుంటారో చూడాలి మరి.
tn

Posted in Uncategorized

Latest Updates