బట్టలు విప్పి అవమానిస్తారా : ఎయిర్ పోర్ట్ లో స్పైస్ జెట్ సిబ్బంది ఆందోళన

speసొంత సిబ్బందిపై స్పైస్ జెట్ అవమానకరరీతిలో వ్యవహరించిన తీరు వెలుగులోకి వచ్చింది. చెకింగ్స్ పేరుతో తమ బట్టలు విప్పించి అవమానకరరీతిలో వ్యవహరించారని విమాన సిబ్బంది ఆరోపిస్తున్నారు. మార్చి 31 శనివారం ఉదయం చెన్నై ఎయిర్ పోర్టులో సిబ్బంది ఆందోళన చేశారు. విమానంలో ఆహారం, ఇతర పదార్థాల విక్రయాల ద్వారా వచ్చే డబ్బులను తీసుకుంటున్నారనేది ఎయిర్ హోస్టస్ పై అనుమానం. కొన్ని రోజులుగా విమానం దిగిన వెంటనే వాష్‌రూంకి వెళ్లనీయకుండా కూడా అడ్డుకుని తమపై ఈ విధంగా తనిఖీలు చేస్తున్నారని స్పైస్ జెట్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి దుస్తులు విప్పించి మరీ తనిఖీలు చేసి అభ్యంతరకరంగా తాకుతున్నారని ఎయిర్‌హోస్టెస్‌లు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన స్పైస్‌జెట్‌ అధికారులు.. కొన్ని రోజులుగా కొంత మంది సిబ్బంది విమానాల్లోని డబ్బును కాజేస్తుండటం వల్లే ఈ కఠినమైన తనిఖీలు చేస్తున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు ఈమెయిల్‌ ద్వారా సిబ్బందికి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates