బడిబాట కార్యక్రమం : విద్యార్థులకు ఉచిత అక్షర అభ్యాసం

BADIBATAతెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ రీ ఓపెన్ కావడంతో స్టూడెంట్స్ బడి బాట పట్టారు. కొత్త యూనిఫామ్స్, బుక్స్, నోట్స్ లతో విద్యార్థులు కళకళలాడుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదువే విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పూజారులు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం (జూన్-6) బాసర సరస్వతీ అమ్మవారి సన్నిథిలో కొంతమంది విద్యార్థులకు ఉచితంగా అక్షర అభ్యాసాలు చేయించారు.   ఆలయ ప్రధాన అర్చకులతో ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా 6వ తరగతిలో ప్రవేశం పొందుతున్న 22 మంది విద్యార్థులకు అక్షర అభ్యాసం చేయించారు. వ్యాపారవేత్త కొండూరి ప్రవీణ్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను అందజేశారు.

Posted in Uncategorized

Latest Updates