బడుగుల బతుకులు మారుస్తామని చంద్రబాబు మాటతప్పారు : పవన్

PAWANఏపీ ప్రజల కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం (మే-27) శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన.. ప్రజల తరఫున పోరాటం ఆపేది లేదన్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తామని మోడీ మోసం చేస్తే… బడుగుల బతుకులు మారుస్తామని చంద్రబాబు మాటతప్పారని ఆరోపించారు. టీడీపీ ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలనుకుంటోందని, జనసేన వల్లే టీడీపీ 2014 ఎన్నికల్లో గెలిచిందని అన్నారు. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని, వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని ప్రశ్నించారు. అధికారం ఏ ఒక్కడి సొత్తు కాదని అన్నారు. అధికార పార్టీ కరెంటు కట్‌ చేయించి తనపై దాడులు చేస్తోందన్నారు పవన్

Posted in Uncategorized

Latest Updates