బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్: సీఎం కేసీఆర్

kcrమండల రైతు సమన్వయ సమితి సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్ . ఈ నెల 25న హైదరాబాద్‌లోని వ్యవసాయ వర్శిటీలోమొదటి సదస్సు, 26న కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో రెండో సదస్సు నిర్వహించాలన్నారు. రైతు సమన్వయ సదస్సులకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు హైదరాబాద్ ప్రగతిభవన్‌లో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం.

వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రైతులకు చేర్చే విషయంలో రైతు సమన్వయ సమితిలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం త్వరలోనే 42 మంది సభ్యులతో రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమితిలో 30 జిల్లాలకు చెందిన ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులకు ప్రాతినిధ్యం కల్పించనుంది. రాష్ట్రస్థాయి సమితిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులకు చోటు కల్పించనుంది.

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వ్యవసాయ బడ్జెట్‌కు ముసాయిదా రూపొందించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సాగుకు పెట్టుబడి మద్దతు సొమ్మును చెక్కుల రూపంలో ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్థికసాయాన్ని చెక్కుల రూపంలో రెండు విడతలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పెట్టుబడి మద్దతు పథకాన్ని ఏప్రిల్ 20న ప్రాంభించాలని… రబీ పంటకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని నవంబర్ 18 నుంచి చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates