బడ్జెట్ లో కుంభమేళాకు రూ.1500 కోట్లు

MAHAప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటి మహా కుంభమేళా. అంతటి ప్రసిద్ధి చెందిన కుంభమేళాను అల‌హాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. శుక్రవారం(ఫిబ్రవరి-16) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌లో కుంభమేళా కోసం రూ.1500 కోట్లు ప్రకటించింది. యూపీ లోని అలహాబాద్‌లో 2019లో కుంభమేళాను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. దీని కోసం ఇప్పటి నుంచే ఆ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చివరిసారిగా 2013లో కుంభమేళా జరగ్గా దాదాపు 10 కోట్ల మంది భ‌క్తులు హాజరయ్యారు. ఈ సారి ఆ సంఖ్య 12 కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కుంభమేళాకు కొద్దిరోజుల క్రితం యునెస్కో గుర్తింపు కూడా లభించింది.

Posted in Uncategorized

Latest Updates