బతుకమ్మ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని..

తెలంగాణ సంస్కృతి కి ప్రతిరూపమైన బతుకమ్మ  విదేశాల్లోనూ ఫేమస్ అయ్యింది. న్యూజిలాండ్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.. తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు.  ఓ దేశ ప్రధాని బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.

న్యూజిలాండ్ లో జరిగిన బతుకమ్మ వేడుకల పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా ప్రధాని.. వేడుకల్లో పాల్గొనడం గొప్ప విషయమని తెలిపారు. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను గౌరవించిన న్యూజిలాండ్ ప్రధానికి ధన్యవాదాలని కేటీఆర్ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates