బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ వేసిన ఈసీ

బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున చీరల పంపిణీకి ఈసీ అనుమతి నిరాకరించింది. ఈ నెల‌ 12 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో చీరల నమూనాల ప్రదర్శనను ప్రారంభించారు. 280 కోట్ల రూపాయల ఖర్చుతో మొత్తం 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది.ఇప్పటికే 50 లక్షల చీరలు జిల్లాలకు చేరుకున్నాయి. అయితే ఈసీ నిర్ణయం కారణంగా ఇప్పుడు దానికి బ్రేక్ పడినట్లు అయింది.
రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నందున బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం సరికాదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వచ్చాయి. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపగా.. పరిశీలించిన సీఈసీ చీరల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates