బతుకమ్మ, చేనేత ప్రచారం.. 9 రోజులు, 9 జిల్లాల్లో మహిళల బైక్ రైడ్

హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఉమన్ బైక్ రైడర్స్ బతుకమ్మ ప్రచారం మొదలుపెట్టారు. బతుకమ్మ పండుగ సహా పలు అంశాలపై ప్రచారం నిర్వహించే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు ఈ బైక్ రైడ్ ను నిర్వహిస్తున్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జెండా ఊపి.. బైక్ రైడ్ ను ప్రారంభించారు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, షీ టీమ్స్ I G స్వాతి లక్రా.

తొమ్మిది మంది మహిళలు, తొమ్మిది బైక్ లపై… తొమ్మిది రోజుల పాటు… తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బైక్ రైడ్ చేయనున్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను, షీ టీమ్స్ ద్వారా మహిళలకు కలుగుతున్న భద్రత…  చేనేత వస్త్రాల ప్రాధాన్యతను వివరించే ఉద్దేశంతో… బైక్ రైడ్ నిర్వహిస్తున్నామన్నారు బుర్రా వెంకటేశం. తొమ్మిది మంది మహిళల బైక్ రైడ్ గురించిన వివరాలు కిందున్న లింక్ లో చూడొచ్చు.

Posted in Uncategorized

Latest Updates