బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక: ఉపరాష్ర్టపతి

తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీకని, ఈ పండుగలో గొప్ప సందేశముందని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ ఐటీ)ని స్థాపించి 60 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఇవాళ(అక్టోబర్-8) నిర్వహించిన డైమండ్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

భవిష్యత్ తరాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రజల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. మెరుగైన వసతులు కల్పించేందుకు పన్నులు వసూలు చేయడం తప్పనిసరని వెంకయ్య అన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలు పోటీపడుతున్నాయని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates