బతుకమ్మ పండగొచ్చింది…నిమజ్జనానికి ఏర్పాట్లేవీ?


హైదరాబాద్ : ఒక్కొక్క పువ్వేసి చందమామ…ఒక్క జాములాయే చందమామ అంటూ తెలంగాణ మహిళలు ఆనందంగా జరుపుకొనే బతుకమ్మ పండగ రానే వచ్చింది. తొమ్మిది రోజులు నిర్వహించే ఈ పండగలో నిన్న ఎంగిళి పూల బతుకమ్మ ముగిసింది. బతుకమ్మ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో ఏర్పాట్లు జరుగలేదు. హుస్సేన్ సాగర్, ఇందిరా పార్కు, కృష్ణకాంత్ పార్కు, జలగం వెంగళరావు పార్కుల వద్ద ఉన్న కొలన్లలో బతుకమ్మల నిమజ్జనం కోసం ఏలాంటి ఏర్పాట్లు చేయలేదు.

  • హుస్సేన్ సాగర్ వద్ద పెద్ద సంఖ్యలో బతుకమ్మల నిమజ్జనం చేస్తారు. కానీ ఇప్పటికి సాగర్ లో ఉన్న గుర్రపు డెక్కలను కూడా తీసేయ్యలేదు.
  • కృష్ణకాంత్ పార్కులో సైతం ఏర్పాట్లు చేయలేదు.
  • ఫిలింనగర్ లోని చిన్న కొలన్ లో బతుకమ్మ నిమజ్జనం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
  • హుస్సేన్ సాగర్, ఇందిరా పార్కు, కృష్ణకాంత్ పార్కు, జలగం వెంగళరావు పార్కుల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలి.
  • కుంటల్లోకి దిగేవారు ప్రమాదబారిన పడకుండా లోతు తక్కువగా ఉన్నచోట్ల బ్యారికేడ్లు నిర్మించాల్సి ఉంది.
  • చెరువులు, కొలనులు అందుబాటులో లేనివారికి ఆయా ప్రాంతాల ఆలయాల వద్ద చిన్నపాటి నీటి తొట్లు ఏర్పాటు చేయాలి.
Posted in Uncategorized

Latest Updates