బదిలీల్లో అక్రమాలు: 17 మంది టీచర్ల సస్పెన్షన్

teacher
తెలంగాణలో టీచర్ల బదిలీల్లో అక్రమాలు వెలుగుచూశాయి. తమకు కావాల్సిన చోట పోస్టింగ్‌ కోసం ఉపాధ్యాయులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్టు అధికారులు గుర్తించారు. అన్నీ సక్రమంగా ఉన్నా అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లు సమర్పించినట్టు నిర్ధారించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇటువంటి అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో లేని రోగాలున్నట్టు చూపించిన 17 మంది ఉపాధ్యాయులపై  సస్పెన్షన్‌ వేటు వేశారు ఆ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని…. బాధ్యులైన టీచర్లపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డీఈవోలకు స్పష్టం చేశారు. ఎంఈవో, డీఈవోల పాత్ర ఉన్నట్లు తేలినా చర్యలు తప్పవని కలెక్టర్‌ చెప్పారు.. అలాగే కలెక్టర్‌ ఆదేశాలతో మెడికల్‌ సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించిన అధికారులు సుమారు 20 మంది పేపలర్లను పక్కనపెట్టారు.

అంతేకాదు …లేని రోగాలున్నట్టు, గుండె ఆపరేషన్‌ జరగకున్నా జరిగినట్టు సర్టిఫికెట్లు జారీ చేసిన నలుగురు డాక్టర్లకు షోకాజ్‌ నోటీసలు జారీ చేశారు. 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates