బద్దకం వీడి ఓటేయండి : మంచు లక్ష్మి ట్వీట్

 హైదరాబాద్ : రేపు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలలో అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలంటూ ప్రముఖ సినీ నటి  మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. “మీ ముందు రెండు ఆప్షన్ లు ఉన్నాయి. ఒకటి మాకు ఈ నాయకుడు కావాలని .. రెండవది.. మాకు ఈ నాయకుడు అక్కర్లేదనే ఆప్షన్ లు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక దానికి తప్పక ఓటేయండి. మీ హక్కును వినియోగించుకొండి. మీ శక్తిని తెలియజేయండి. నేతలు మీ కోసం పని చేసేలా చేయండి. మీరు ఓటు వేస్తేనే.. వాళ్లు మీ కోసం పని చేస్తారు. అంతే కాని బద్దకంగా ఉండకండి’’ అంటూ తెలంగాణ ఓటర్లకు మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates