బయోపిక్ కు బ్రేక్! : గ్యాంగ్ స్టర్ లా యోగీ ఆదిత్యనాధ్

డైరక్టర్ వినోద్ కుమార్ తివారీ తెరకెక్కిస్తున్న “జిలా గోరఖ్ పూర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ఇప్పడు వివాదాలకు దారి తీస్తుంది. పోస్టర్ లో కాషాయ దుస్తులు ధరించిన యోగి ఆదిత్యనాధ్ చేతిలో గన్ పట్టుకుని ఉండటమే దీనికి కారణం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను డైరక్టర్ తెరకెక్కిస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డైరెక్టర్ పై విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ నాయకులు తివారీపై కేసులు పెట్టారు.

ఈ సినిమా ప్రధాన ఉద్దేశం.. రాష్ట్రంలో అన్యాయంగా జరుగుతున్న హత్యలపైనే అని, ఇది యోగి ఆదిత్యనాధ్ బయోపిక్ కాదని సృష్టం చేశారు. యోగి బయోపిక్ అని వస్తున్న రూమర్లు తప్పు అని.. ఇవి బేస్ లెస్ లెస్ ఆరోపణలని  తెలిపారు. ఈ పోస్టర్ ఓ పెద్ద వివాదానికి దారి తీయడంతో మనస్ధాపం చెందినట్లు తెలిపారు. ముందస్తు ప్రమోషన్ లో భాగంగానే.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశామని, సినిమా ప్రాజెక్ట్ ఇంకా ఫ్లోర్ దశలోనే ఉందని, కాస్టింగ్ కూడా ఫైనలైజ్ కాలేదని, సినిమా పోస్టర్ వివాదాలకు దారి తీస్తుండటంతో.. నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా తాను మూవీ మేకింగ్ ను ఆఫ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సెంటిమెంట్లను తాను హర్ట్ చేయాలని భావించట్లేదని తెలిపారు డైరెక్టర్ తివారీ.

సినిమా ప్రొడ్యూసర్ కు దమ్ముంటే సినిమా రిలీజ్ చెయ్యాలని యూపీ మాజీ మంత్రి, బీజేపీ లీడర్ ఐపీ సింగ్ సవాల్ విసిరారు. ట్విట్టర్ వేదికగా ఐపీ సింగ్ ఓ ట్వీట్ చేశారు. చీప్ పబ్లిసిటీ కోసమే ఈ సినిమా చేస్తున్నారని, నాధ్ కమ్యూనిటీని, యోగి ఆదిత్యనాధ్ ను తప్పుగా చూపించే విధంగా పోస్టర్ ఉందని, దీన్ని ఏమాత్రం సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే ఈ సినిమా రిలీజ్ చేయాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాకుండా లక్నోలోని విభుతి కంద్ పోలీస్ స్టేషన్ లో సినిమా టీమ్ పై కేసు పెట్టారు.

 

Posted in Uncategorized

Latest Updates