బయో ఏషియో సదస్సులో కేటీఆర్ : ప్రపంచానికి వాక్సిన్ రాజధానిగా హైదరాబాద్

ktrఫార్మా పరిశ్రమకు రాజధాని హైదరాబాద్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో మూడో రోజు జరుగుతున్న బయో ఏషియా సదస్సు కు రాష్ట్ర మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి సురేష్ ప్రభు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…  ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ఫార్మా ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. హైదరాబాద్ బల్క్ డ్రగ్ హబ్‌గా ప్రసిద్ధికెక్కింది. వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందని కేటీఆర్ తెలిపారు.

ఈ సదస్సులో పాల్గొన్న కేంద్రమంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ…  ఫార్మా రంగం అభివృద్ధికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ చొరవ ప్రశంసనీయమన్నారు. చాలా దేశాలు ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. ఫార్మా పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడటం ప్రభుత్వ బాధ్యతన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో ఫార్మా కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, గత ఇరవై ఏళ్లలో భారత్‌లో పరిశ్రమలు ఎంతో అభివృద్ధి సాధించాయని సురేష్ ప్రభు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates