బయ్యారం స్టీల్ ఫ్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది : కేటీఆర్

KTRబయ్యారం స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర సర్కార్ కట్టుబడి ఉందన్నారు మంత్రి కేటీఆర్. బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అధ్యాయనం చేసేందుకు TS యండీసీ, సింగరేణి అధికారులు, ఇందన, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. కమిటీ నెల రోజుల్లో అధ్యాయనం పూర్తి చేసి…స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు భూ వివరాలు, నీరు, బొగ్గు, విద్యుత్ వంటి కీలకమైన అంశాలపైన నివేదిక ఇస్తుందన్నారు. నివేదిక ప్రకారం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ముందుకు వెళ్తామన్నారు మంత్రి. బయ్యారం ప్లాంటు ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చినా, రాకున్నా రాష్ట్ర సర్కార్ ముందుకే పోతుందన్నారు.
విభజన చట్టంలో పేర్కొన్నట్లు ….స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు మంత్రి. కానీ నాలుగేళ్లుగా కాలం వెళ్లదీస్తుంది తప్పా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్ర సర్కార్ తరుపున కేంద్రానికి లేఖలు రాయటంతో పాటు….డైరెక్ట్ గా కలిసి విన్నవించామన్నారు. అయితే బయ్యారంలో అందుబాటులో ఉన్న ఇనుము నాణ్యత పేరుతో మెళిక పెడుతుందని కేంద్రంపై మండిపడ్డారు. బయ్యారం ప్లాంటు ఏర్పాటుకు అన్ని విధాలుగా తెలంగాణ సర్కార్ సాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే ఒడిసాలోని బైలాడిల్లా నుంచి ఇనుప ఖనిజం బయ్యారానికి తరలించేందుకు అవసరం అయిన రైలు మార్గ నిర్మాణంలో 50 శాతం రాష్ర్టం భరిస్తుందని కేంద్రానికి తెలిపామన్నారు.

Posted in Uncategorized

Latest Updates