బరితెగించిన కుర్రోళ్లు : పోలీసులను కారుతో తొక్కించి వెళ్లారు

kill

అదో కారు.. అందులో ఐదుగురు కుర్రోళ్లు. అందరి వయస్సు 21 ఏళ్లు. ఇంజినీరింగ్ చదువుతున్నారు. అందులోనూ మద్యం మత్తులో ఉన్నారు. వాళ్లు జోరు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫుల్ గా మందుకొట్టి స్టీరింగ్ పట్టిన కుర్రోడు.. ఏకంగా పోలీసులను తొక్కించుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

కాకినాడు ఎస్పీ ఆఫీస్ సమీపంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట డ్రైవ్ చేపట్టారు పోలీసులు. హెల్మెట్ లేనివారిని పట్టుకుని చలానా విధించటం. ఇందుకోసం రోడ్డుకి అడ్డంగా బారికేడ్లు కూడా పెట్టారు. ఈ టైంలోనే ఓ కారు వచ్చి ఆగింది. అందులో 21 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్ శిద్దా శ్రీనివాస్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అతనితోపాటు మరో నలుగురు ఉన్నారు. అందరూ మద్యం తాగి ఉన్నారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు అనుకుని.. కారును ఆపకుండా ముందుకు పోనిచ్చారు. విషయాన్ని పసిగట్టిన శ్రీనివాస్.. కారును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. పోలీసులు కారుకు అడ్డంగా నిలబడ్డారు. అయినా దూకుడుగా ముందుకు వచ్చాడు. ఆ వెంటనే ఓ కానిస్టేబుల్ కారుకి అడ్డంగా బారికేడ్ పెట్టాడు. దాన్ని కూడా ఢీకొట్టి.. అడ్డంగా నిలబడిన పోలీసులను తొక్కించుకుంటూ ముందుకు వెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వీరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయం తప్పింది.

పోలీసులను తొక్కించుకుంటూ వెళ్లిన కారు కోసం మరో వాహనంలో వెంబడించారు పోలీసులు. మిగతా వారికి సమాచారం ఇచ్చి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కుర్రోళ్లపై 332, 307 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

Posted in Uncategorized

Latest Updates