బరితెగింపుకి పరాకాష్ఠ : ఈడ్చుకెళ్లి.. తెంపుకుని వెళ్లారు

CHAIN-SNACTHINGబయటకు వెళ్లిన మహిళ క్షేమంగా తిరిగి వస్తుందా లేదా అనే ఆందోళన ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. బయటకు వెళ్లిన మహిళ.. ఒంటిపై ఉన్న బంగారంతో సురక్షింగా ఇంటికి చేరుతుందా లేదా అనే భయం పట్టుకుంది. ఎక్కడ పడితే అక్కడ.. గల్లీల్లోనూ చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. చెన్నై సిటీలో జరిగిన ఓ చైన్ స్నాచింగ్ సంచలనం అయ్యింది. మహిళ మెడలోని బంగారు తాడు తెగకపోవటంతో.. బైక్ పై ఈడ్చుకుంటూ వెళ్లారు దొంగలు.

చెన్నై సిటీ ఓల్డ్ వాషర్ మెన్ పేటకు చెందిన మేనక.. నిన్న రాత్రి సరుకులు కొనుగోలు కోసం బయటకు వచ్చింది. ఆ గల్లీలో ట్రాఫిక్ ఉండదు. అంతేకాదు రోజూ తిరిగే ప్రాంతం కావటంతో టెన్షన్ లేకుండా నడుస్తుంది. ఇంతలో బైక్ పై ఇద్దరు కుర్రోళ్లు వెనక నుంచి వచ్చారు. మేనక మెడలోని తాళిబొట్టును లాక్కునేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన ఆమె.. గట్టిగా పట్టుకుంది. అయినా చైన్ స్నాచర్స్ వదల్లేదు. బరితెగించి మరీ.. బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తాడు తెగే వరకు వదల్లేదు. దీంతో మేనక.. తీవ్రంగా గాయపడింది. కొద్దిదూరం అలాగే ఈడ్చుకెళ్లిన దొంగలు.. బంగారు గొలుసును తెంపుకుని మరీ వెళ్లారు. ఈ దారుణం.. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం మేనక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

సీసీ కెమెరా విజువల్స్ టీవీల్లో ప్రసారం కావటంతో.. చెన్నైలోని మహిళలకు రక్షణ లేదంటా మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. వివాదం పెద్దది కాకముందే చైన్ స్నాచర్స్ ను అరెస్ట్ చేసేందుక రంగంలోకి దిగారు పోలీసులు..

Posted in Uncategorized

Latest Updates