బరీగా తిని కూర్చున్నారు : కాంగ్రెస్ నిరాహార దీక్షపై బీజేపీ సెటైర్లు

ate-before-fast

దళితులకు మద్దతుగా, ఎస్సీ,ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక రోజు నిరాహార దీక్షపై బీజేపీ విరుచుకుపడింది. నిరాహార దీక్షకి ముందు.. కాంగ్రెస్ నేతలు ఓ హోటల్ లో టిఫిన్ చేస్తున్న ఫొటో విడుదల చేసి కలకలం రేపింది. దీనిపై వరస పెట్టి కామెంట్స్ చేయటంతోపాటు సోషల్ మీడియా వేదికగా విచుకుపడింది. కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, హరూన్ యూసుఫ్, అర్విద్ సింగ్ తోపాటు మరికొందరు ఓ హాటల్ లో పూరీలు తింటూ ఉంటారు. ఈ ఫొటోను బీజేపీ నే హరీష్ ఖురానా పోస్ట్ చేశారు. నిరాహార దీక్ష పేరుతో కాంగ్రెస్ నేతలు రెస్టారెంట్ లో హాయిగా కడుపు నింపుకుంటున్నారు అంటూ కామెంట్ చేశారు. ఇది కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యింది.

ఈ ఫొటోపై బీజపీ రాద్దాంతం చేయటంతో కాంగ్రెస్ నేతలు వివరణ ఇచ్చారు. రాజ్ ఘాట్ దగ్గర ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు మాత్రమే దీక్ష చేస్తామని ప్రకటించాం అని.. ఈ ఫొటో ఉదయం 8 గంటల సమయంలో తీసిందని చెప్పారు. ఇది నిరవధిక దీక్ష కాదన్న సంగతి బీజేపీకి తెలియదా అని అర్విద్ సింగ్ లవ్వీ మీడియాకి వెల్లడించారు. దేశంలో పరిపాలనను గాలికొదిలేసి.. ఎవరేం తింటున్నారో చూడ్డాం కేంద్రం పని కాదని చురకలు అంటించారు. ఈ ఫొటో వచ్చిన తర్వాత దీక్ష నుంచి మధ్యలోనే అజయ్ మాకెన్ వెళ్లిపోవటం కూడా చర్చనీయాంశం అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates