బరువు తగ్గించే పచ్చి బఠానీ

పచ్చి బఠానీ చాలామంది ఇష్టంగా తింటారు. కూరగాయలతో కలిపి పలు వంటల్లో వండుతారు. ఎక్కువగా వెజ్‌, నాన్‌ వెజ్‌ బిర్యానీలలో వేస్తారు. అలాగే పన్నీరు కర్రీ, ఆలు కుర్మాలో వేస్తారు. పచ్చి బఠానీ తినడం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. కంటి సమస్యలను నివారించవచ్చు, రక్తహీనత ఉన్న వాళ్లు ఇవి తింటే రక్తం పెరుగుతుంది. ఎముకలు, దంతాలు మరింత బలంగా తయారవుతాయి. ఇవి తింటే పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. అలాగని ఎక్కువ తింటే ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది. చాలా రోగాలు దరికి రావు. విటమిన్‌ ఎ, బి1, బి2 సి, ఐరన్‌ , కాల్షియం, పాస్పరస్‌ వీటిలో ఎక్కువగా ఉన్నా యి. కాబట్టి వీటిని తింటే శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. వెంటనే ఆకలి కూడా వేయదు. వీటిని తిన్న తర్వాత మిగిలిన పదార్థాలు తక్కువ తీసుకుంటారు. తక్కువ క్యాలరీలు అందుతాయి కాబట్టి, బరువు పెరిగే ప్రమాదం రాదు. వీటిని తినడం వల్ల ఫైబర్ కూడా లభిస్తుంది. కాబట్టిరోజూ తినే ఆహారంలో పచ్చి బఠానీ లేకపోయినా వారానికి ఒక సారైనా వీటిని సూప్‌గా అయినా తీసుకుంటే అన్ని విధాలా మంచిది.

Posted in Uncategorized

Latest Updates