బర్త్ డే విషెస్ కోసమేనా! : కాంగ్రెస్ సీనియర్ల ఢిల్లీ టూర్ పై ఉత్తమ్ క్లారిటీ

RBరాష్ట్ర  కాంగ్రెస్  సీనియర్లు  రాహుల్ ను  కలువడం  రాజకీయ చర్చకు  కారణమైంది.  కేవలం బర్త్ డే  విషెస్  చెప్పేందుకు  రాహుల్ ను  కలిశామని  ఇటు కాంగ్రెస్ నాయకులు అటే పీసీసీ చీఫ్ చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీ  బలోపేతం  కోసం  కమిటీ వేయాలని  రాహుల్ ను  కోరినట్లు చెప్పారు నాయకులు.

2019లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్లు. రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా సహా సీనియర్ నాయకులు పాల్గొన్నారు.  సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించామన్నారు. పార్టీ నాయకులలో ఎలాంటి విభేదాలు లేవన్నారు.

పీసీసీ చీఫ్ లేకుండా కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ ను కలవడంపై పార్టీలో చర్చ మొదలైంది. అయితే..  రెండ్రోజుల క్రితం ఉత్తమ్ రాహుల్ ని కలిశారని అందుకే ఆయన ఢిల్లీ రాలేదన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కమిటీ వేసి.. వన్ టు వన్ మీటింగ్ పెట్టాలని కోరారు నేతలు.

కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీ వెళ్లడంపై హైదరాబాద్ లో మాట్లాడారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. కేవలం రాహుల్ కు..  బర్త్ డే  విషెస్  చెప్పేందుకు వెళ్లారని, తనపై కంప్లైంట్ చేయడానికి కాదని చెప్పారు. పార్టీలో  చేరేందుకు  టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ నుంచి  చాలామంది టచ్ లో  ఉన్నారన్నారు ఉత్తమ్.  సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. గాంధీ భవన్ లో పుట్టిన రోజు  వేడుకల తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు ఉత్తమ్. సర్పంచ్  రిజర్వేషన్లు అస్థవ్యస్థనంగా  ఉన్నాయన్నారు. ఏ ప్రాతిపాదికన , ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తామంటున్నారో  స్పష్టత ఇవ్వాలని  ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. ప్రభుత్వం తెచ్చిన పంచాయత్ రాజ్ చట్టానికి విరుద్ధంగా  రిజర్వేషన్లు  ఉన్నాయన్నారు ఉత్తమ్.

 

Posted in Uncategorized

Latest Updates