బర్మింగ్‌ హామ్‌ టెస్ట్ : ఇంగ్లాండ్ 287 ఆలౌట్

భారత్‌ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ 287 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు బుధవారం (ఆగస్టు-1) 285 పరుగుల వద్ద ఆటను ముగించిన ఇంగ్లండ్, రెండో రోజు గురువారం (ఆగస్టు-2) మ్యాచ్ ప్రారంభం కాగానే మహమ్మద్ షమీ మరోసారి నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. షమీ బంతిని ఎదుర్కొనే క్రమంలో శామ్ కర్రన్(24).. కార్తీక్‌ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీయగా, షమీ 3 వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌ మెన్‌ లో కెప్టెన్ రూట్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌ గా నిలవగా.. బెయిర్‌ స్టో 70 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 103 రన్స్ చేసినా .. రూట్ రనౌట్ మ్యాచ్‌ ను మలుపు తిప్పింది. చివరి సెషన్‌ లో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి రోజు ఓవరాల్‌ గా ఇండియా పైచేయి సాధించింది.

Posted in Uncategorized

Latest Updates