బర్మింగ్ హోమ్ టెస్ట్ : లంచ్ బ్రేక్..ఇంగ్లాండ్ 86/6

తొలి టెస్టులో భాగంగా బర్మింగ్‌ హోమ్ లో భారత్‌ తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు శుక్రవారం (ఆగస్టు-3) మ్యాచ్ ను ప్రారంభించింది ఇంగ్లాండ్. ఓవర్‌ నైట్ స్కోరు 9/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌ మెన్లను తిప్పలు పెడుతున్నాడు. తనదైన స్టైల్లో బౌలింగ్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. రెండో రోజు నాలుగో ఓవర్లోనే అలిస్టర్ కుక్‌(0)ను పెవిలియన్ పంపి వికెట్ల ఖాతా తెరిచిన అశ్విన్.. మూడో రోజు తన జోరు కొనసాగిస్తున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్‌ ను ఔట్ చేశాడు. 7.4వ బంతిని జెన్నింగ్స్(8) డిఫెన్స్ ఆడగా బాల్ కాస్త రెండో స్లిప్‌ లో ఉన్న రాహుల్ చేతిలో పడింది.

ఆ తర్వాత కెప్టెన్ జో రూట్‌(14)ను పెవిలియన్ పంపి టీమ్ లో ఉత్సాహం నింపాడు. 16వ ఓవర్ తొలి బంతిని షాట్ ఆడగా ఆ బాల్ మళ్లీ రాహుల్‌ కే దొరకడంతో రూట్ గ్రౌండ్ ని వీడాడు. వెంటనే బెన్ స్టోక్, బెయిర్ స్టో ఔట్ అయ్యారు. దీంతో మ్యాచ్‌ పై పట్టుసాధించింది కోహ్లీ సేన. ఇలాగే ధాటిగా బౌలింగ్ చేస్తే ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశం కోహ్లీసేన ముందుంది. లంచ్ బ్రేక్ కు.. 30.4 ఓవర్లు ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌ లో ఇంగ్లాండ్ 6 వికెట్లకు 86 పరుగులు చేసింది. దీంతో 99 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Posted in Uncategorized

Latest Updates