బలపడిన రుతుపవనాలు..మోస్తరు వర్షాలకు అవకాశం

coulds
దేశంలో నైరుతీ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ లో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తెలుగురాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు పడుతూ ఉండగా రేపటినుంచి (బుధవారం) మరింత పెరగొచ్చు అంటున్నారు వాతావరణ అధికారులు

దేశంలో చాలా ప్రాంతాల్లో విస్తరించింది నైరుతి. దీని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి గుజరాత్ లో జోరు వానలు పడుతున్నాయి. దీంతో జనానికి వరద కష్టాలు  కొనసాగుతున్నాయి.  నిన్న(సోమవారం) రాత్రినుంచి వడోదరలో  కుండపోత వర్షం కురుస్తోంది. కార్పొరేషన్  ఆఫీస్,  కోర్టు  కొత్త భవనాల్లోకి  నీళ్లు చేరాయి. కూడళ్లలో నీళ్లు  నదుల్లా  పారుతున్నాయి.

చాలా చోట్ల వాహనాలు  నీటమునిగాయి.  వడోదర  మేయర్  కారు .. రోడ్డుపై  గుంతలో ఇరుక్కుపోయింది.  నగరంలోని  రోడ్లపై  నీళ్లు నిలిచిపోవడంతో..  రవాణా అస్తవ్యస్తంగా  మారింది.  గుజరాత్ లో  వర్షాలకు ఆరావలి  జిల్లాలోని …ధన్సురా  గ్రామం  నీటమునిగింది.  చాలా ఇళ్లలోకి  నీళ్లు  చేరాయి. దీంతో ప్రభుత్వం కూడా సహాయక చర్యలు పెంచింది. ముంపు ప్రాంతాల బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మహారాష్ట్రలో మోస్తరు వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షం తగ్గినా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు అలాగే ఉంది. ముంబైలో వరదనీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు చిన్నారులను రక్షించబోయి ఓ బస్సుడ్రైవర్ నీటిలో మునిగి చనిపోయారు. పశ్చిమబెంగాల్ లో కూడా ఇదే పరిస్థితి. వర్షాలు వరదలతో జనం ఇబ్బందులు  పడుతున్నారు

తెలుగు రాష్ట్రాల్లో నిన్నా మొన్నటి వరకు బలహీనంగా ఉన్న రుతుపవనాలు కాస్త బలపడ్డాయి.  మంగళవారం(జూన్-26) తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం(జూన్ -27) వర్షాలు పెరగొచ్చంటున్నారు వాతావరణ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates