బలమైన ముహూర్తాలు : మూడు రోజుల్లో లక్షల్లో పెళ్లిళ్లు

marriageపెళ్లి ముహూర్తాలు వచ్చేశాయి.. సీజన్ మొదలవ్వడంతో అంతా హడావిడి. రెండు నెలల తర్వాత మంచి రోజులు రావటం.. అందులోనూ మూడు రోజులు మాత్రమే బలమైన ముహూర్తాలు ఉండటంతో రాష్ట్రంలో సందడి నెలకొంది. మార్చి 4వ తేదీ ఒక్కరోజే వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. మార్చి 3 నుంచి 11 వరకు తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి సందడి ఎక్కువగా కనిపించనుంది. మార్చి 4, 6, 11 తేదీల్లో ముహూర్త బలం బాగుండటంతో.. లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. మార్చి 4వ తేదీన హస్త నక్షత్రం.. తిథి తదియ కావటంమే కారణం. మార్చి 6న స్వాతి నక్షత్రం, పంచమి, 11న పూర్వాషాడ నక్షత్రం, దశమి కావడంతో ఈ మూడు రోజుల్లోనే ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు.

మార్చి 11వ తేదీ తర్వాత శ్రీరామనవమి (మార్చి25) వరకు ముహూర్తాలు లేవని చెబుతున్నారు పండితులు. ఏప్రిల్ నెలలో మంచి రోజులు ఉన్నా.. ముహూర్త బలం లేదంటున్నారు పురోహితులు.

Posted in Uncategorized

Latest Updates