బలితీసుకుంది : స్కూల్లోకి దూసుకొచ్చి.. పిల్లలను తొక్కిన ట్రక్కు

bihar-BUSబీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో శనివారం(ఫిబ్రవరి-24) మధ్యాహ్నం ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పి ఓ స్కూలు బిల్డింగ్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates