బల్క్ డ్రగ్ మెడికల్ డివైజ్ పార్కుల స్కీమ్ లు రెడీ: కేంద్ర మంత్రి సదానంద గౌడ

గైడ్లైన్స్ను రిలీజ్చేసిన ఫెర్టిలైజర్స్మినిస్టర్‌‌‌‌ డీవీ సదానంద గౌడ

గ్లో బల్ఫార్మా హబ్గా మారుస్తాం..

పీఎల్ స్కీమ్కిందకు కొత్త యూనిట్లు

న్యూఢిల్లీ: బల్క్‌‌ డ్రగ్స్‌‌ ప్రొడక్షన్‌ లో సొంత కాళ్లపై నిలబడేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త స్కీములను తీసుకు వస్తోంది. దేశంలో బల్క్‌‌ డ్రగ్‌ , మెడికల్ డివైజ్ పార్క్‌‌లను డెవలప్‌ చేసేందుకు నాలుగు స్కీమ్‌ల గైడ్‌ లైన్స్‌‌లను ప్రభుత్వం సోమవారం రిలీజ్‌ చేసింది. దేశీయంగా ఏపీఐ మాన్యుఫాక్చరింగ్‌ ను పెంచడానికి ప్రభుత్వం ఈ స్కీమ్‌లను తీసుకొస్తోంది. ప్రధాని మోడీ విజన్‌ కు అనుగుణంగా ఫార్మా సెక్టార్‌కు ఊపు ఇచ్చేందుకు తాజా స్కీములను తెస్తున్నారు. ‘ఆత్మ నిర్భర్‌ ’ను బలపరిచేలా ఫార్మా రంగం కోసం వీటిని రెడీ చేశామని కెమికల్స్‌‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌‌ మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. 53 క్రిటికల్‌ యాక్టివ్‌‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌‌(ఏపీఐ) లేదా కీ స్టా ర్టిం గ్‌ మెటీరియల్స్‌‌(కేఎస్‌ ఎం) లను ఇండియాలోనే తయారయ్యేలా చూడటమే ఈ స్కీమ్స్‌‌ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు మెడికల్‌ డివైజ్‌ లను కూడా ఇక్కడే తయారు చేసేందుకు పార్క్‌‌లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

ప్రస్తుతం మెడికల్‌ డివైజ్‌లు , ఏపీఐల కోసం ఇండియా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోం ది. ఇండస్ట్రీలు , రాష్ట్ర ప్రభుత్వా లతో చర్చించే ఈ స్కీమ్స్‌‌ డిటైల్స్‌‌ను తీసుకొచ్చామని గౌడ పేర్కొన్నారు . బల్క్‌‌డ్రగ్‌, మెడికల్‌ పార్క్‌‌లను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది తర్వాత నిర్ణయిస్తామని, ఇది సమాఖ్య భావానికి అద్ధం పట్టేలా ఉంటుం దని అన్నారు. అర్హులైన మాన్యుఫాక్చరర్లకు పీఎల్‌ ఐ స్కీమ్‌ కోసం సెలెక్ట్‌‌ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పార్క్‌‌లను ఏర్పాటు చేస్తామని గౌడ చెప్పారు. ఈ పార్క్‌‌లలో కామన్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ , ఎక్స్‌‌లెం ట్‌ కనెక్టివిటీ, అఫర్డ్‌ బుల్‌ లాం డ్‌ , మెరుగైన ఆర్ అండ్‌ డీ ఎకోసిస్టమ్‌ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దీంతో కొత్తగా మాన్యుఫాక్చరిం గ్‌ యూనిట్లను పెట్టా లనుకునే కంపెనీలకు టైమ్‌ తో పాటు ఖర్చు కూడా తగ్గుతుం దని చెప్పారు. దీనికి తోడు కొత్త యూనిట్లు ప్రొడక్షన్‌ లింక్ డ్‌ ఇన్సెం టివ్‌‌(పీఎల్‌ ఐ) స్కీమ్‌ కింద అర్హత పొందుతాయి. కంపెనీల నుంచి ఈ స్కీమ్స్‌‌కు మంచి రెస్పాన్స్‌‌ వస్తుందని గౌడ అభిప్రాయపడ్డారు.  ఇన్వెస్ట్‌‌మెంట్లను, లేటెస్ట్‌‌ టెక్నాలజీని ఈ పార్క్‌‌లు ఆకర్షిస్తాయని చెప్పారు. ఒకసారి ఈ పార్కులు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షం గా, పరోక్షంగా వేల జాబ్ లు క్రియేట్‌ చేస్తాయని అన్నారు. అంతేకాకుండా దిగుమతులపై ఆధారపడడం తగ్గి, గ్లోబల్‌ ఫార్మా స్యూటికల్‌ హబ్‌‌గా ఇండియా మారుతుందని పేర్కొన్నా రు. గ్లోబల్‌ డ్రగ్‌ సప్లయర్‌ గా ఇండియా బలోపేతం కావడానికి ఈ పార్కులు సాయపడతాయన్నా రు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ గ్లోబల్‌ గా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ , పారాసిటమల్‌ వంటి మెడిసిన్స్‌‌ను విదేశాలకు ఇండియా సప్లయ్‌ చేసిందని పేర్కొన్నా రు. ‘ప్రస్తుతం పార్మా సెక్టార్‌ వాల్యూ 40 బిలియన్‌ డాలర్లుగా ఉంది. సరియైన మద్దతుం టే ఇది 2024 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. దీంతో 2025 నాటికి ప్రధాని 5 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి వీలుంటుం ది’ అని మంత్రి చెప్పారు.

ఇన్‌‌ఫ్రా స్టేటస్ఇవ్వం డి: సతీష్ రెడ్డి

 ఏపీఐ ఇండస్ట్రీకి ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ స్టేటస్‌ ఇస్తే ఇన్సూరెన్స్‌‌ కంపెనీలు, ఇతర ఫండ్స్‌‌ నుంచి 10–15 ఏళ్ల టెన్యూర్‌ తో ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు లోన్లు దొరుకుతాయని ఇండియన్‌ ఫార్మాస్ యూటికల్‌ అలయన్స్‌‌ (ఐపీఏ) ప్రెసిడెంట్‌ , డాక్టర్‌ రెడ్డీస్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి చెప్పారు. ఎక్స్‌‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయిం గ్‌ రూట్‌ ద్వారా ఫారిన్‌ కరెన్సీ ఫండింగ్‌ ను తెచ్చుకోవడానికి వీలుంటుం దని అన్నారు. కెపాసిటీని పెంచడానికి , ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ను డెవలప్‌ చేసుకోవడానికి క్యాపి టల్‌ ను సమీకరించుకోవడం సులువవుతుందని పేర్కొన్నారు. క్యాపిటల్‌ అవసరాలను తీర్చుకోవడానికి షార్ట్‌‌ టెన్యూర్‌ లోన్లకు ప్రస్తుతం ఏపీఐ సెక్టా ర్‌ ఎక్కువ వడ్డీని చెల్లిం చాల్సి వస్తోందని సతీష్‌ రెడ్డి తెలిపారు. కాబట్టి ఏపీఐ ఇండస్ట్రీకి ఇన్‌ ఫ్రా స్టేటస్‌ ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించాలని కోరారు. దేశంలో ఏపీఐ, బల్క్‌‌డ్రగ్‌ మాన్యుఫ్యా క్చరింగ్‌ ను మెరుగుపరచడానికి ప్రభుత్వం పీఎల్‌ ఐ స్కీమ్‌ ను తీసుకొచ్చిందని, కామన్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ పెసిలిటీస్‌ నూ ఏర్పాటు చేస్తోందని సతీష్‌ రెడ్డి అన్నారు. ఎన్విరా న్‌ మెంటల్ క్లియరెన్స్‌‌ ప్రాసెస్‌ ను సులువు చేయడం, ట్యాక్స్‌‌ ప్రోత్సాహకాలు, లైసెన్స్‌‌ రెన్యూవల్స్‌‌, క్యాపిటల్‌ సబ్సిడీలు వంటి సపోర్ట్‌‌ కూడా తమ ఇండస్ట్రీకి అవసరమని చెప్పారు. ఇండియాలో అప్రూవల్స్ రావడానికి 50–85 నెలల టైమ్ పడుతోందని, అదే విదేశాలలో 23–26 నెలలే పడుతోం దని, మన దేశంలోనూ ఈ ప్రాసెస్‌ టైమును తగ్గిం చాలని అభిప్రాయపడ్డారు.

Latest Updates