బసవ తారకమ్మ ఫస్ట్ లుక్ విడుదల.. రేపు ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది. సినిమాలో లీడ్ రోల్స్ చేస్తున్న నటీనటుల స్టిల్స్ .. చాలామందిలో ఆసక్తిని పెంచేశాయి. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. బసవతారకమ్మగా విద్యాబాలన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది సినిమా యూనిట్. ‘తారకరాముడితో బసవతారకమ్మ’ ట్యాగ్ తో ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. బసవతారకం హార్మోనియం వాయిస్తుండగా… ఎన్టీఆర్  చూస్తుండిపోయే స్టిల్ అది.

చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది ఎన్టీఆర్ బయోపిక్. కథానాయకుడు.. మహానాయకుడు అనే రెండు పార్టులుగా మూవీని విడుదల చేస్తున్నారు. రేపు శుక్రవారం ‘కథానాయకుడు’ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. సెకండ్ పార్ట్ మహానాయకుడు.. ఫిబ్రవరిలో విడుదలవుతుందని దర్శకనిర్మాతలు చెప్పారు. ఎన్బీకే ఫిలింస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు దర్శకుడు జాగర్లమూడి క్రిష్. ఎంఎంకీరవాణి సంగీతం అందిస్తున్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates