బస్సులపై ప్రభుత్వ ప్రకటనలు తొలగించాలన్న టీడీపీ

హైదరాబాద్ :  ప్రభుత్వ వాహనాలు, బస్సులపై ఇంకా ప్రభుత్వ ప్రకటనలు కనిపిస్తున్నాయని.. వాటిని తొలగించాలంటూ టీడీపీ నాయకులు సెక్రటేరియట్ లో సీఎస్ SK జోషిని కలిశారు. అసెంబ్లీ రద్దైనప్పటినుంచే కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పారు. నిబంధనల ప్రకారం….. అధికార పార్టీ నేతలు ఎస్కార్ట్ వాహనాలు వాడొద్దని చెప్పారు. పబ్లిక్ పల్స్ పేరిట… అభ్యర్థులకు ముఖ్యనేతలు ప్రచారం చేస్తున్నారని… వాటిని సీడీ రూపంలో సీఎస్ కి ఇచ్చామమన్నారు. వీటన్నింటినీ పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారని చెప్పారు టీడీపీ సీనియర్ నేత రావు చంద్రశేఖర్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates