బస్సులో అగ్నిప్రమాదం… 21 మంది మృతి

bus22థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సులో అకస్మాత్తుగా మంటలు రావడంతో డ్రైవర్ తో సహా 21 మంది ప్రయాణికులు చనిపోయారు.

47 మంది మయన్మార్‌కు చెందిన వలస కూలీలను తీసుకొని వెళ్లున్న డబుల్ డెక్కర్ బస్సులో అర్ధరాత్రి సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో 21 మంది అక్కడిక్కడే చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని స్ధానిక పోలీసులు తెలిపారు.  గాయపడిన వారిని ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మార్చి 21 న కూడా ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 18 మంది చనిపోయారు.

Posted in Uncategorized

Latest Updates