బహిరంగంగానే : ట్రంప్ పోస్టర్ పై పాడుపని చేసిన హాలీవుడ్ యాక్టర్

ఇమ్మిగ్రేషన్ విధానంపై…డోనాల్డ్ ట్రంప్ పై నిరసన తెలిపే క్రమంలో…పబ్లిక్ ప్లేస్ లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ దగ్గర బహిరంగంగా అందరి ముందు మూత్ర విసర్జన చేశాడు మెక్సికన్-అమెరికన్ కమెడీయన్ జార్జిలోఫేజ్(57).
బుధవారం(జులై-11) TMZ ఓ సెల్ ఫోన్ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో జార్జిలోఫేజ్.. డొనాల్డ్ ట్రంప్ అని రాసి ఉన్న ప్లేస్ లో చుచ్చూ పోశాడు. లోఫేజ్ ఇదంతా చేస్తున్న సమయంలో చుట్టూ ఉన్నవారంతా నవ్వుతూ కనిపించారు. అయితే వీడియోలో అతడు పోసింది రియల్ మూత్రం కాదు.. ట్రంప్ పేరుపై మూత్రం పోసేందుకు ఓ వాటర్ బాటిల్ ను ఉపయోగించాడు. గతంలో కూడా ఓ ఛారిటీ ఈవెంట్ లో ఇలానే విచిత్రంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు లోఫేజ్.

లోఫేజ్ వ్యవహారశైలిపై అమెరికన్లు భగ్గుమన్నారు. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగంగా అందరి ముందూై పాడుపని చేసిన లోఫేజ్ ను లోపలేయాలని డిమాండ్ చేస్తున్నారు అమెరికన్లు. షాపింగ్ మాల్ లో చేసిన ఈ పాడుపనిపై.. ఆ తర్వాత సారీ చెప్పాడు లోఫేజ్..

Posted in Uncategorized

Latest Updates