బహిష్కరణ చెల్లదు : కోమటిరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఊరట

komatireddy-venkat-reddy-highcourtకోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. వారి శాసనసభ సభ్యత్వాల రద్దు చెల్లదని తీర్పు ఇచ్చింది హైకోటు. ఐదేళ్లు వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని ఆదేశించింది. అదే విధంగా గతంలో ఉన్న అన్ని బెనిఫిట్స్ వర్తింపజేయాలని కోరింది. ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని ఆదేశించింది కోర్టు. అసెంబ్లీ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను కూడా రద్దు చేసింది. ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన రిపోర్ట్ ను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు 169 పేజీల తీర్పును వెల్లడించింది హైకోర్టు. అసెంబ్లీలో  ఎమ్మెల్యేల తీరుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భావిస్తే.. ఈ తీర్పు అడ్డంకి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మార్చి 12వ తేదీన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమారులు అనుచితంగా ప్రవర్తించారు. ప్రసంగం కాపీలు చింపివేశారు. మైక్ లు విరిచి విసిరేయటంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు ఆ మైక్ తగిలింది. దీంతో ఆయన కంటికి గాయం అయ్యింది. ఆ తర్వాత ఆయన ఆస్పత్రికి చిక్సిత పొందారు. ఈ పరిణామాలతో మార్చి 14వ తేదీన వీరిద్దరి శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదేశాలకు సవాల్ చేస్తూ.. హైకోర్టుకి వెళ్లారు వీరు.

Posted in Uncategorized

Latest Updates