బహుజన బతుకమ్మ పోస్టర్ల తొలగింపుపై అభ్యంతరం

హైదరాబాద్ : సెక్రటేరియట్ హెచ్ బ్లాక్ లోని ఈసీ ఆఫీస్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిశారు తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క. ఎన్నికల కోడ్ పేరుతో… బహుజన బతుకమ్మ సంబురాల పోస్టర్లను తొలగించడంపై ఆమె అభ్యంతరం చెప్పారు. బహుజన బతుకమ్మ పోస్టర్లు పండుగను ఉద్దేశించి పెట్టినవే అని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి .. పండుగ కోసం ఏర్పాటుచేసిన పోస్టర్లకు సంబంధం ఏమీ లేదని.. పోస్టర్ల తొలగింపును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు విమలక్క.

ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో.. ఈసీ అధికారులు కఠినంగా ఉంటున్నారు. ప్రలోభాలకు లోను చేసేలా ఉన్నవాటిపై యాక్షన్ తీసుకుంటున్నారు. వాల్ పోస్టర్లు, ఫ్లెక్స్ లు, బ్యానర్లు అన్నీ తీసేస్తున్నారు. ఎవరైనా పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగులు, బస్సుల్లో ప్రకటనలను కూడా తొలగిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates