బాటిళ్లు విసురుకున్నారు : రసాభసాగా జెడ్పీ సమావేశం

ZP MEETING APతూర్పు గోదావరి జిల్లాలో ఉచిత ఇసుకకు పక్కదారి పట్టిస్తున్నారని సీరియస్ అయ్యారు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ఫ్రీ శాండ్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మాఫియాగా మారిందన్నారు. అయితే దీనిపై స్పందించిన శాసనమండలి డిఫ్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఇసుక మాఫియాను నడిపించేది నువ్వేనంటూ చిర్ల జగ్గిరెడ్డిపై విరుచుకుపడ్డారు.  దీంతో గురువారం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన జెడ్పీ సమావేశం రసాభసాగా జరిగింది.

ఒక్క సారిగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుభ్రమణ్యం , కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గరెడ్డి పరస్పరం వ్యక్తి దూషనలకు చేసుకున్నారు. ఉచిత ఇసుక విషయంలో ప్రారంభమైన వాగ్వాదం … నువ్వె దొంగ అంటే.. నువ్వె దొంగ అంటూ ఒక్కరి పై ఒక్కరు పరస్పరం దాడి చేసుకునే ప్రయత్నాలు చేశారు. అంతలో జిల్లా కలెక్టర్ , జెడ్పీ చైర్మన్ ఇరువురిని శాంతింప చేయడంతో పరిస్థితి సద్దుమనిగింది.

Posted in Uncategorized

Latest Updates