బాదం పాలతో ఎన్నో లాభాలు

 

 

 

ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది బాదం తింటుంటారు. బాదంతో ఎలాంటి లాభాలున్నాయో… అంతకంటే ఎక్కువ బాదం పాలలో ఉన్నాయి. బాదంపాలు తేలికగా జీర్ణమవుతాయి. శరీరానికి కావల్సిన పోషకాలను బాదం పాలు అందిస్తాయి. బాదం పాలలో విటమిన్-డి, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉండేలా చేస్తాయి. విటమిన్-ఇ కూడా పుష్కలంగా ఉండటంతో చర్మం సంరక్షించబడుతుంది. అంతేకాదు శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. బాదం పాలలో మన శరీరానికి పనికొచ్చే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌‌‌‌ను, హైబీపీ తగ్గిస్తాయి. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్లు బాదం పాలను తీసుకోవడం మంచిది. దీంతో శరీరంలో కొవ్వు చేరదు. ఎక్కువ ఆకలిని దూరం చేస్తుంది. దీంతో బరువు తగ్గొచ్చు. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. వ్యాయామం ఎక్కువగా చేసేవారు బాదం పాలు తాగితే కండరాలు బలంగా తయారవుతాయి. శరీరం చక్కని ఆకృతి పొందుతుంది.

Posted in Uncategorized

Latest Updates