బాబాయ్ చిటికేస్తే చాలు : జనసేనకి ప్రచారం చేస్తా

pawan-ramcharanరాంచరణ్ సంచలన ప్రకటన చేశారు. బాబాయ్ పవన్ కల్యాణ్ చిటికేస్తే చాలు.. జనసేన తరపున ప్రచారం చేయటానికి పరిగెత్తి వెళతా అంటున్నారు. ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఓ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సెలక్ట్ అయిన క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా మీటింగ్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడే కాదు.. ప్రజారాజ్యం పార్టీ సమయంలోనే ప్రచారం చేస్తానని చెప్పానని.. అయితే అప్పుడు బాబాయ్ వద్దని చెప్పటంతో ఆగిపోయాను అన్నారు.

బాబాయ్ పవన్ కల్యాణ్ జనం కోసం చాలా కష్టపడుతున్నారని.. ఆయన ఎప్పుడు రమ్మని పిలిస్తే.. అసలు చిటికేస్తే చాలు.. వెళ్లిపోతాను అన్నారు. ఇప్పటికే మెంటల్ గా ప్రిపేర్ అయ్యానని.. బాబాయ్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎనీ టైం సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన చెర్రీ.. ఆ పిలుపు ఎప్పుడు వస్తుందో అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. అప్పట్లో వద్దన్న పవన్.. ఇప్పుడు రమ్మంటారా అనేది కూడా మరో ఇంట్రస్టింగ్ పాయింట్. 2019 ఎన్నికలపై దృష్టి పెట్టిన జనసేన అధినేత పవన్.. ఇప్పటికే ఏపీ మొత్తం చుట్టేస్తున్నారు. టీడీపీ టార్గెట్ గా దూసుకెళుతున్నారు. ఎన్నికల సమయంలో చెర్రీ సేవలు కూడా ఉపయోగించుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. రాంచరణ్ మాటలు చూస్తుంటే అదే నిజం కూడా అవ్వొచ్చు.. నిప్పు లేనిదే పొగ రాదు కదా…

Posted in Uncategorized

Latest Updates