బాబా గట్టిగా అడిగారు : పసుపు బోర్డ్ ఎందుకు ఏర్పాటు చేయరు

babaనిజామాబాద్ జిల్లాలో రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు బాబా రాందేవ్. పసుపు బోర్డు కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తే తానూ పాల్గొంటానని హామీ ఇచ్చారు. మంగళవారం (ఏప్రిల్-10) నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

తాను రైతు బిడ్డనని.. రైతులు చేసే పోరాటానికి మద్దతు ఉంటుందన్నారు. మంచి పని కోసం ముందు వరుసలో ఉంటానని చెప్పిన బాబా.. పసుపు బోర్డు ఏర్పాటుకు జరుగుతున్న పోరాటానికి మద్దతు ఉంటుందన్నారు. బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ కవిత తీవ్రంగా కృషి చేస్తున్నారని.. దేశంలో పతంజలిదే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు. దేశంలో 15 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ పతంజలి గ్రూప్ ద్వారా జరుగుతుందన్నారు. డెయిరీ బిజినెస్‌ లోనూ పతంజలి అడుగుపెట్టబోతుందని చెప్పారు బాబా రాందేవ్.

పసుపు బోర్డు కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు ఎంపీ కవిత. రైతుల ఆందోళనకు మీ మద్దతు ఇలాగే కొనసాగాలని రాందేవ్ బాబాను కోరారు ఎంపీ. పసుపు బోర్డు కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని.. ఎలాగైనా పసుపు బోర్డును ఏర్పాటు చేసే విధంగా ప్రధానితో మాట్లాడాలని రాందేవ్ బాబాకు విజ్ఞప్తి చేశారు. పతంజలి కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్‌ ను నిజామాబాద్ లో నెలకొల్పాలని కోరారు. మూడు రోజుల యోగా క్యాంపు నిర్వహణకు రాందేవ్ బాబా అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పతంజలి కంపెనీ చేపట్టబోయే ప్రతి పనికి ఇప్పుడు.. మున్ముందు కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున మద్దతు ఇస్తామని తెలిపారు ఎంపీ కవిత.

Posted in Uncategorized

Latest Updates