బాబా గుడిలో దారుణం.. హత్య చేసి హుండీ దోపిడి

భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెంలోని సాయిబాబా గుడిలో దారుణం జరిగింది. నగరంలో ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న గుడిలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ప్యూన్ బస్తీకి చెందిన చల్ల వెంకటరెడ్డి(70) తల పై ఆయుధంతో కొట్టి దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆలయంలో నిద్రిస్తున్న వెంకటరెడ్డిని హత్య చేసిన దుండగులు తర్వాత హుండీలు పగులగొట్టి అందులో ఉన్న డబ్బును దోచుకున్నారు.  ఈ ఘటన శనివారం(అక్టోబర్ 6) అర్ధరాత్రి జరిగింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దింపారు.

 

Posted in Uncategorized

Latest Updates