బాబుపై పవన్ ట్విట్ : అవిశ్వాసంతో డ్రామాలొద్దు

రాజకీయాలు పక్కనపెట్టి ఏపీ ప్రజలకు న్యాయం చేయాలన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. కేంద్రంపై టిడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న క్రమంలో శుక్రవారం (జూలై-20) జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజల పక్షాన కేంద్రాన్ని కోరుతున్నట్లు పవన్ తెలిపారు. ప్రదాని మోడీ.. తెలుగుదేశం పార్టీతో చెడినందున… వారిపై కోపంతో ప్రత్యేక హోదా నిరాకరించటం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఏపీ ప్రజల హక్కులు సాధించుకునేందుకు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంటు సరైన వేదికగా భావిస్తున్నట్లు ట్విట్ చేశారు పవన్‌. ఏపీ ప్రజల హక్కు గురించి కేంద్రం అర్ధం చేసుకోవడానికి పార్లమెంట్ ను మించిన వేదిక మరొకటిలేదని తెలిపిన పవన్..TDP, BJP ఇన్నాళ్లూ ఏపీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వృథా చేశాయన్నారు. ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల తరుపున నిలబడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు పవన్.

Posted in Uncategorized

Latest Updates