బాబు గోగినేని పై కేసు నమోదు

babu-gogineniహేతువాది బాబు గోగినేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  రహస్యంగా ఉంచాల్సిన ఆధార్  చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ఔత్సాహికుల సమాచారాన్ని సేకరిస్తున్నారంటూ….కేవీ నారాయణ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ప్రైవేట్ కార్యక్రమానికి ఆధార్ నెంబర్ తీసుకోవడంతో పాటు.. హేతువాత ప్రచారం కోసం నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో 13 సెక్షన్ల కింద  మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బాబు గోగినేని, అతని అనుచరులు వాళ్ల సంస్థల ద్వారా ఆధార్ వివరాలను విదేశాలకు అందజేస్తున్నారని.. ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని ఫిర్యాదులో తెలిపారు. సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్‌కు ఫౌండర్ గా ఉన్న బాబు గోగినేని… మలేషియాలో దీనికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. హేతువాద సమావేశాలంటూ సభ్యులకు ఆహ్వానం పలికి తప్పనిసరిగా వారి ఆధార్ నెంబర్‌ను తీసుకుంటారు. ఆ ఆధార్ నెంబర్లను వెబ్‌సైట్‌లో పెట్టడం ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతోంది.

హైదరాబాద్, బెంగళూరు, విశాఖలో ఇటీవల బాబు గోగినేని ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్స్‌లో పాల్గొనాలంటే ఆధార్ నెంబర్ తీసుకోవడమే కాకుండా.. ఆ నెంబర్లను వెబ్ సైట్‌లో పెట్టారని మాదాపూర్ పోలీసులు బాబు గోగినేనిపై కేసు నమోదు చేశారు.

Posted in Uncategorized

Latest Updates