బాబు, రేవంత్ లపై ఓ లుక్కేయండి.. ఈసీకి ఫిర్యాదు

సెక్రటేరియట్ : హైదరాబాద్ సెక్రటేరియట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ని కలిశారు తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ న్యాయవాదులు. ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ మాజీ నాయకుడు రేవంత్ రెడ్డి లపై రజత్ కుమార్ కు కంప్లయింట్ చేశారు.

ఎన్నికల సందర్భంగా… రాష్ట్ర కాంగ్రెస్ పార్టీతో… టీడీపీ పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తోందని… ఎన్నికల ప్రచారంలో భాగంగా.. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి రూ.ఐదు వందల కోట్లు ఇచ్చారని ఈసీకి చెప్పారు లాయర్లు. రేవంత్ రెడ్డి వ్యవహారాలపై నిఘా పెట్టాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. అడ్వకేట్స్ జేఏసీ తరఫున ఈసీని కలిశారు లాయర్లు.

Posted in Uncategorized

Latest Updates