బాబూ జగ్జీవన్ రామ్ కు ఘననివాళి

VIVEKమాజీ ఉప ప్రధాన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం (ఏప్రిల్-5) హైదరాబాద్ లో ఆయన విగ్రహానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి.. ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. జగ్జీవన్ రామ్ .. దళితుల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అటు.. ఎన్డీఏ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కేంద్రానికి చిత్తశుద్ది ఉంటే.. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్ వేయాలన్నారు.

బాబు జగ్జీవన్ రామ్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు మాజీ మంత్రి వినోద్. దళిత వర్గాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో ప్రయత్నం చేశారన్నారు. అన్ని అర్హతలున్నా జగ్జీవన్ రామ్ కు ప్రధాని కాలేకపోవడం బాధాకరమన్నారు. జగ్జీవన్ విగ్రహానికి పూలమాట వేసి నివాళులర్పించారు వినోద్. దేశంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు ప్రజాకవి, గాయకుడు గద్దర్. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. దళితులంతా ఐక్యమై .. వచ్చే ఎన్నికల్లో రాజకీయ శక్తిగా ఎదగాలన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల వేసి, నివాళి అర్పించారు గద్దర్.

Posted in Uncategorized

Latest Updates